హిందూపూర్ ప్రజలకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు

టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలకు 3 లక్షల రూపాయలు విలువ చేసే 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచారు.

కరోనా సంక్షోభం లో ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్రము లో ఏ నాయకుడు చేయని విదంగా కరోనా బదితులకు అండగా నిలిచిన బాలక్రిష్ణ గారు.

కరోనా బాధితులు హిందూపురంలోని ఎమ్మెల్యే నివాసం లో సంప్రదించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పొందవచ్చు అని ఈ సందర్భం గా ప్రకటన విడుదల చేసారు.

నందమూరి బాలకృష్ణ గారు ఇదివరకే హిందూపూర్ ప్రజలకి బసవతారకం కాన్సర్ ఆసుపత్రి తరుపున కరోనా నివారానికి సంబంధించిన మందులతో పాటు కరోనా సోకి ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్ సీలిండెర్స్ అందజేసిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ గారి పెద్ద మనసు, దాతృత్వం చూసి నియోజకవర్గంలోని ప్రజలు , తోటి నాయకులూ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు

Comments are closed.