సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను సీఎంకు సమర్పించారు. కోవిడ్‌–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళాన్ని  ఛైర్మన్‌, సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్‌ మస్తాన్‌లు సీఎంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అధికార భాషా సంఘమే లేదన్నారు. వైఎస్ జగన్‌ సీఎం అయ్యాక అధికార భాషా సంఘం ఛైర్మన్‌ను నియమించారన్నారు. అధికారిక కార్యకలాపాల్లో తెలుగుభాష అమలుపై  పర్యవేక్షణ చేయమని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. 

15,513 thoughts on “సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌