ఆసియా ‘కుబేరులు’…

అంబానీ.. అదానీ… బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం… అంబానీ, అదానీ… ఆసియాలోనే కుబేరులుగా నిలిచారు. ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో జాక్ మా వంటి చైనా బిలియనీర్లను సైతం వీరు అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… అంబానీ సంపద 84 బిలియన్లకు చేరుకోగా, అదానీ సంపద 78 బిలియన్లకు పెరిగింది.

ఈ క్రమంలో… ఈ ఇద్దరూ… ఆసియాలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మేరకు ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ… పన్నెండవ, అదానీ పధ్నాలుగవ స్థానాల్లో నిలిచారు. ఫ్రెంచ్ జాతీయులు ఎల్విఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్(రెండవ), ప్రపంచ ధనవంతురాలు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్(పదవ), ప్రధాన ఎల్’ఓరియల్ వాటాదారులలో ఒకరైన వారసురాలు లిలియాన్ హెన్రియెట్ షార్లెట్ బెటెన్కోర్ట్ తప్పితే జాబితాలో అంబానీ కన్నా ముందున్న వారందరూ అమెరికన్లే.

Comments are closed.