28 బంతుల్లోనే సెంచరీ.. రికార్డులు బద్దలుకొట్టిన బ్యాట్స్‌మన్

యూరోపియన్ క్రికెట్ టీ10 సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే  13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. యూరోపియన్ క్రికెట్‌లో భాగంగా టీహెచ్‌సీసీ హాంబర్గ్‌ జట్టుకు కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టుకు మధ్య మంగళవారం టీ10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఓపెనర్‌ అహ్మద్ ముస్సాదిక్ రికార్డు సెంచరీ సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అహ్మద్ భారీ ఇన్నింగ్స్‌‌తో కమ్మర్ ఫెల్డర్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. 

కాగా.. 199 పరుగలు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీహెచ్‌సీసీ జట్టు.. 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Comments are closed.