ఏపీలోని 3.7లక్షల మందికి రూ.10వేలు బ్యాంకులో పడతాయి

ఓవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు కరోనా.. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల్ని ఎప్పటిలా అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి వాటిని డీల్ చేయటంలో తనకు మించినోళ్లు లేరన్నట్లుగా చేతల్లో  చేసి చూపిస్తున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన జగనన్న తోడు పథకం కింద ఈ రోజున 3.7 లక్షల మంది చిరు వ్యాపారులు.. సాంప్రదాయ వృత్తి కళాకారులను ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ కానున్నాయి.

ఈ రూ.10వేల మొత్తాన్ని వడ్డీ లేని రుణంగా ఇవ్వనున్నారు. కరోనా వేళలో చిన్న వ్యాపారులు. వృత్తి కళాకారులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వీరికి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గత ఏడాది 5.35 లక్షల మందికి రూ.10వేలు చొప్పున డిపాజిట్ చేశారు. రెండో దశలో ఇప్పుడు 3.7 లక్షల మంది అబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో మొత్తం రూ.905 కోట్లను ఈ పథకం కింద పేదలకు అందించినట్లుగా చెప్పాలి.

ఈ పథకం కింద ఇచ్చిన మొత్తానికి కాను.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బ్యాంకులకు రూ.49.77కోట్ల మొ్తతాన్ని వడ్డీగా చెల్లించాల్సి ఉంది. తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చే విషయంలో ఏం జరుగుతుందన్నదిఇప్పుడు ప్రశ్నగా మారింది. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అవేమీ పట్టించుకోకుండా తానిచ్చిన మాటకు తగ్గట్లుగా అమలు చేయటం ఆసక్తికరంగా మారింది.

Comments are closed.