వ్యాక్సిన్ తీసుకోండి ..టెస్లా కారు గోల్డ్ బార్స్ సొంతిల్లు అందుకోండి !

కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి శుభవార్త హాంకాంగ్ లో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన వారికి  ఖరీదైన టెస్లా కార్లను గోల్డ్ బార్లను అందించనున్నాయి అక్కడి కార్పొరేట్ సంస్థలు. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా లీకా షింగ్ సీకే గ్రూప్ తన ఛారిటబుల్ సంస్థలతో  కలిపి మంగళవారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన వారికి లాటరీ ద్వారా 2.6 మిలియన్ డాలర్ల విలువైన షాపింగ్ వోచర్లను గిఫ్ట్గా ఇవ్వనుంది.

మరో బిలియనీర్ అడ్రియన్ చెంగ్ నేతృత్వంలోని న్యూ వరల్డ్ గ్రోత్ కో ద్వారా టీకా తీసుకున్న అల్పాదాయ వర్గాల వారికి హాంకాంగ్  నగరంలో10 మిలియన్ డాలర్లను ఆఫర్ చేయనుందని ప్రభుత్వ ముఖ్య అధికారి క్యారీ లామ్ తెలిపారు. హాంకాంగ్ లోని పటు కార్పొరేట్ కంపెనీలు రెస్టారెంట్లు తమ ఉద్యోగులకు నగదు చెల్లింపులు వోచర్లు  ఇతర ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా సినో గ్రూప్నకు  చెందిన చారిటీ  విభాగం ఎన్జీ టెంగ్ ఫాంగ్ ఛారిటబుల్ ఫౌండేషన్  చైనీస్ ఎస్టేట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్  సంయుక్తంగా గత నెలలో క్వాన్ టోంగ్ ప్రాంతంలో  1.4 మిలియన్ల  అపార్ట్మెంటును బహుమతిగా అందిస్తామని  వెల్లడించాయి. హాంకాంగ్ కు చెందిన అతిపెద్ద డెవలపర్ సోలార్ హంగ్ కై ప్రాపర్టీస్ లిమిటెడ్  వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఐఫోన్లతోపాటు ఇతర బహుమతులను అందిస్తోంది.  బిజినెస్ టైకూన్ లీ షా కీ హెండర్సన్ ల్యాండ్ గ్రోత్ కంపెనీ  గోల్డ్ బార్స్ ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఏజెన్సీ గుడ్ మాన్ గ్రూప్ ఆగస్టు 31 నాటికి టీకాలు వేసుకున్న వారికోసం ఒక లాటరీని స్కీంను  ప్రకటించింది. ఒక మిలియన్ కి పైగా హాంకాంగ్ డాలర్ల బహుమతిని లాటరీ ద్వారా అందిస్తుంది.

Comments are closed.