ఈసారి వృద్ధి 8.3 శాతమే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) లో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 8.3 శాతానికి కుదిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ ఏప్రిల్‌లో అంచనా వేసిన 10.1 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు 2 శాతం తక్కువ. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ద్వితీయార్ధంలో అంచనాల కంటే వేగంగా జరిగిన వృద్ధి పునరుద్ధరణను కరోనా రెండో దశ ఉధృతి అణిచివేసిందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయపడింది. సేవల రంగాల వృద్ధి పునరుద్ధరణపై అధిక ప్రభావం చూపిందని నివేదికలో పేర్కొంది. 

వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో మాత్రం వృద్ధి 7.5 శాతానికి, ఆపై ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.5 శాతానికి పరిమితం కావచ్చని నివేదికలో పేర్కొంది.  2020-21లో జీడీపీ వృద్ధి మైనస్‌ 7.3 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. 

ప్రపంచ వృద్ధి 5.6 శాతం 

ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదు కావచ్చని వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా. జనవరిలో పేర్కొన్న 4.1 శాతంతో పోలిస్తే అంచనాను గణనీయంగా పెంచింది.   గడిచిన 80 ఏళ్లలో మాంద్యం తర్వాత సంవత్సరంలో నమోదు కానున్న అత్యంత వేగవంతమైన వృద్ధి ఇదే కానుందని రిపోర్టులో పేర్కొంది.

Comments are closed.