బీఓఐ సహా మూడు ప్రభుత్వ బ్యాంకులు… అమ్మకానికి..!

బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మూడు ప్రభుత్వ బ్యాంకుల అమ్మకానికి రంగం సిద్ధమైంది. సంబంధిత నివేదికలు ఈ అంశాన్ని చెబుతున్నాయి. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది కూడా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లు సమాచారం. 

కాగా… బ్యాంకుల ప్రైవేకీకరణ మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కంపెనీలను కూడా ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్ కంపెనీ, ఎయిరిండియా సంస్థలు ఈ దిశగానే నడుస్తున్నట్లు వినవస్తోంది. వాస్తవానికి ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. 

One thought on “బీఓఐ సహా మూడు ప్రభుత్వ బ్యాంకులు… అమ్మకానికి..!

Comments are closed.