16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. కామోద్దీపన ఇంజక్షన్లు ఇచ్చి 8 ఏళ్లుగా..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 8 ఏళ్లుగా జరుగుతున్న దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అంధేరీలో ఓ 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెకు కామోద్దీపన ఇంజక్షన్లు ఇచ్చి 8 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం ఓ వ్యాపారవేత్త కుమార్తె జూనియర్ కాలేజీలో చదువుతోంది. పొరిగింట్లో ఉండే నిందితుడు ఆమెకు కామోద్దీపన ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఇస్తూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. నిందితుడి నిర్వాకం అతడి భార్యకు కూడా తెలుసని బాధిత బాలిక పేర్కొంది. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. 

అరెస్ట్ అయిన మరో ఇద్దరిలో ఒకరు తండ్రి తరపు బంధువు కాగా, మరొకడు అతడి 19 ఏళ్ల కుమారుడు. బాలికను పెళ్లి చేసుకుని తన కుటుంబం నుంచి డబ్బులు గుంజాలని భావించిన ఆమె బంధువు ఉత్తరప్రదేశ్ తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడి కుమారుడితో తనకు పరిచయం ఏర్పడిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ట్యాబ్లెట్లకు తాను పూర్తిగా అలవాటు పడిపోయానని తెలిపింది.

తన వద్ద అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, వాటిని బయటపెడతానని చెబుతూ పొరుగింటి వ్యక్తి తనను బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాను పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయానని వివరించింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో గాలించి చివరికి బాలికను రక్షించారు. ఆమె అంకుల్, కజిన్‌లను నిన్న అదుపులోకి తీసుకున్నారు. 

One thought on “16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. కామోద్దీపన ఇంజక్షన్లు ఇచ్చి 8 ఏళ్లుగా..

Comments are closed.