ఏపీ అభివృద్ధి విజన్ @ 2030

కరోనా కల్లోలం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అన్ని దేశాల జీడీపీలు భారీగా పతనమయ్యాయి. అయితే ఏపీలో మాత్రం సంక్షేమం అభివృద్ధికి ఏ లోటు రాకుండా సీఎం జగన్ పంచుతున్న డబ్బులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సైతం చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతోందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్ తో ముందుకు వెళుతున్నామని ఆయన వెల్లడించారు.

సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గౌతం రెడ్డి చెప్పుకొచ్చారు. పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను అవలంభిస్తున్నామని చెప్పారు.

దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రిని పరిశ్రమల శాఖ ఉద్యోగులు ఏపీఐఐసీ చైర్మన్ రోజా సత్కరించారు.

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు. రాష్ట్రంలో 1.58 శాతం అభివృద్ధి రేటు నమోదు చేశామని తెలిపారు. నవరత్నాలు వల్లే ఈ అభివృద్ధి రేటు పెరిగిందన్నారు. రామాయపట్నం మచిలీపట్నం భావనపాడులను అందుబాటులోకి తేవడం ద్వారా పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు వస్తాయని మంత్రి గౌతం రెడ్డి తెలిపారు.

2023 డిసెంబర్ నాటికి భోగాపురం పూర్తి చేస్తామని.. 3 ఇండస్ట్రీయల్ కారిడార్లు.. మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తున్నాయన్నారు. 3 కాన్సెప్ట్ సిటీలను సీఎం ప్లాన్ చేశారని.. ఆగస్టులో మరోసారి టెక్స్ టైల్ ఎంఎస్ఎంఈలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. ఇండస్ట్రీలు రావడానికి బాక్ ఎండ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Comments are closed.